ఏపీలో కరోనా అప్ డేట్స్: 24 గంటల్లో 67 కొత్త కేసులు!

  • నిన్న 8,263 శాంపిల్స్ పరీక్ష
  • మొత్తం కేసులు 1,717, 589 మంది డిశ్చార్జ్
  • ట్విట్టర్ లో వెల్లడించిన ఆరోగ్య శాఖ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి ఏ మాత్రమూ తగ్గుతున్న సంకేతాలు కనిపించడం లేదు. నిన్న కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.

"రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,263 శాంపిల్స్ ని పరీక్షించగా 67 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1717 పాజిటివ్ కేసులకు గాను 589 మంది డిశ్చార్జ్ కాగా, 34 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1094" అని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతాలో అధికారులు పేర్కొన్నారు.అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 13, కడప జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతో పాటు రాష్ట్రంలో వున్న గుజరాత్ వాసుల్లో 14 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.

Twitter
Arogya Andhra
Corona Virus
New Cases
Andhra Pradesh

More Telugu News